Telangana Police: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత మృతి చెందారు.
Also Read: Singer Chinmai: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై.. వైరల్ కామెంట్స్ చేసిన చిన్మయి
మంచిర్యాలలో గుండెపోటుతో ఎస్‌ఐ మృతి:
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) తెల్లవారుజామున తన క్వార్టర్‌లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. తానాజీ స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామం. . ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read: Gongidi Trisha: రెండేళ్ల వయసు నుంచే క్రికెట్ వైపు.. నా కూతురు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం – ఎస్‌ఐ శ్వేత మృతి:
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. శ్వేత గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహన దారుడు కూడా మృతి చెందాడు. ఆమె అకాల మరణం పోలీస్ శాఖను శోకసంద్రంలో ముంచేసింది. ఈ రెండు ఘటనలు పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపాయి. శ్వేత, తానాజీ మృతిపట్ల సహోద్యోగులు, కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతికి గురయ్యారు. మరణించిన అధికారుల కుటుంబాలకు పోలీస్ శాఖ సంతాపం తెలిపింది.