TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ నేటి ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ tgprb.in లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంది. ఈ నియామకాల్లో పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్, ఏఆర్, టీజీఎస్పీ), అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో), భారీ సంఖ్యలో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫైర్ ఫైటర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, జైళ్ల శాఖలో వార్డర్లు, డిప్యూటీ జైలర్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి.
ప్రభుత్వం ఈసారి అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతో దరఖాస్తుదారుల సంఖ్య మునుపటి కంటే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకత కోసం అధికారులు ఈసారి ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. దీనికోసం అభ్యర్థులు తమ ఫోన్లలో ముందుగానే ఆధార్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
Also Read
- India's Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
- Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
- AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
- Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
దరఖాస్తు విధానం పార్ట్-1, పార్ట్-2ల ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు తమ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకున్న తర్వాత అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని నిర్దేశిత పరిమాణంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సకాలంలో దరఖాస్తులు పూర్తి చేసి అభ్యర్థులు తమ అర్హతకు తగ్గ పోస్టులకు పోటీపడవచ్చు.
తాజావార్తలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!