Site icon NTV Telugu

Congress : తెలంగాణలో పీసీసీ అబ్జర్వర్ల నియామకం.. 70 మంది నేతలకు బాధ్యతలు

Congress

Congress

Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అబ్జర్వర్లను నియమించింది. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 35 జిల్లాలకు ఇద్దరు చొప్పున మొత్తం 70 మంది నేతలను అబ్జర్వర్లుగా నియమించారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు మహిళా నేతలకు కూడా అవకాశాన్ని కల్పించారు. ఈ నియామకంపై సమావేశంలో టీఎస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా చర్చించారు. మహిళా నేతలకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం.

అబ్జర్వర్ల జాబితాలో ఎమ్మెల్యేలు డా. బీ. మురళీనాయక్, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్, మహిళా నేతలు భీమగంటి సౌజన్యగౌడ్, రవళిరెడ్డి, లకావత్ ధన్వంతి, బోజ్జ సంధ్యారెడ్డి ఉన్నారు. ఈ అబ్జర్వర్లు ఏప్రిల్ 25 నుండి మే 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ముందుగా ఏప్రిల్ 25-30 మధ్య జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు, మండలాల వివరాలు, ఇతర కీలక సమాచారం సేకరించనున్నారు. జిల్లా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల్ని తీసుకుని, పదవుల కోసం ప్రతిపాదనలను రూపొందిస్తారు.

ప్రతి బ్లాక్‌కు మూడు, మండలానికి ఐదు, గ్రామానికి మూడు పేర్లను ప్రతిపాదించే విధంగా కమిటీలు నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలు టీపీసీసీకి పంపించి, అక్కడి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తరఫున కూడా అబ్జర్వర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై తుది చర్చ, నిర్ణయాలు తర్వాతి దశలో ఉంటాయని టీపీసీసీ వెల్లడించింది. గుజరాత్‌ తరహాలో ఏఐసీసీ ఒకే ఒక అబ్జర్వర్‌ను జిల్లాకు పంపిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయనున్నట్లు సమాచారం.

Pahalgam terror attack: ఉగ్రవాదుల జాడ చెప్పిన వారికి రూ. 20 లక్షల నగదు బహుమతి..

Exit mobile version