Site icon NTV Telugu

Jagadish Reddy : రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర

Jagadish Reddy

Jagadish Reddy

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్‌ ఇస్తూ… ఏపీకి ఉన్న విద్యుత్‌ బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా దీనిపై మంత్రి జగదీష్‌ రెడ్డి స్పందిస్తూ.. ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే.. తెలంగాణాప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీ నుండి రావాల్సిన 12,900 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదని ఆయన వెల్లడించారు. విద్యుత్ తోపాటు, బకాయిలు, పీపీఏ లలోను తెలంగాణకు ఏపీ నష్టమే చేసిందని ఆయన తెలిపారు. ఒక్కరోజు కుడా కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదని, గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందన్నారు. దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు, ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణా లోనేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేక పోతుందని జగదీష్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

 

ఆందుకే బీజేపీ సర్కార్ కు కంటగింపుగా ఉందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుందని ఆయన దుయ్యబట్టారు. అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదని, ఏపీ నుండి రావాల్సిన 12,941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని, నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. జాతీయ ప్రభుత్వంగా చేయాల్సింది ఇది కాదని, తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, కేంద్రానికి ఏపీ లేఖలే కనిపిస్తున్నాయని, తెలంగాణా లేఖలు మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version