NTV Telugu Site icon

Telangana Exit Poll Results 2024: తెలంగాణలో గెలుపెవరిది?.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా..

Telangana

Telangana

Telangana Exit Poll Results 2024: సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా.. సర్వే సంస్థలు ప్రజల నాడి ఎలా ఉందని తేల్చాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..? ఎన్నికల్లో విజేతగా నిలిచేది ఎవరు..?.. తెలంగాణ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదల కావడంతో.. ఈ ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కాస్త పెరిగింది.  తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు రానున్నాయన్నది.. ఆయా సంస్థలు సర్వే ఫలితాలు వెల్లడించనున్నాయి. ఫలితాలకు మరో 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సర్వే సంస్థల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలకు ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయో తెలుసుకుందాం.

తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌

తెలంగాణ(17)
సీఎన్‌ఎన్‌ న్యూస్ 18
కాంగ్రెస్ 5-8
బీజేపీ 7-10
బీఆర్‌ఎస్ -1

జన్‌కీ బాత్‌:
కాంగ్రెస్ 4-7
బీజేపీ 9-12
బీఆర్‌ఎస్‌-1
ఇతరులు-1

ఆరా మస్తాన్‌ సర్వే

బీజేపీ 8-9
కాంగ్రెస్ 7-8
ఎంఐఎం 1
బీఆర్ఎస్ 0

ఇండియా టుడే తెలంగాణ లోక్‌ సభ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ 4-6
బీజేపీ 11-12
బీఆర్ఎస్‌ 0-1
ఇతరులు 1