Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. రక్త సంబంధీకులే పోటీ పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు పోటీగా నిలిచారు. సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం గడువు ముగిసే సమయానికి ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా.. ముగ్గురు పోటీలో మిగిలారు. వీరిలో తెడ్డు శివకుమార్ (స్వతంత్ర అభ్యర్థి), రౌట్ల స్రవంతి (బీఆర్ఎస్ మద్దతు) స్వయానా అన్నాచెల్లెళ్లు కావడం విశేషం. మరోవైపు.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూర్ గ్రామపంచాయతీ బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. అయితే ఇక్కడ సర్పంచ్ పదవీ కోసం సొంత అన్నదమ్ములు బరిలో ఉన్నారు. కొమ్మ గోపాల్ యాదవ్ బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగగ.. కాంగ్రెస్ మద్దతుతో కొమ్మ రాజు ఒకే కుటుంబం నుంచి సర్పంచ్ పదవీ కోసం తలపడుతున్నారు. ఈ రెండు ఉదాహరణలు మాత్రమే ఈ ఎన్నికల్లో ఇంకా అనేక మంది రక్తసంబంధీకులు పోటీ పడుతున్నారు.
READ MORE: Off The Record: తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్యే ఆదిమూలం ఫిక్స్ అయ్యాడా..?
ఇదిలా ఉండగా.. ఇప్పటికే రెండవ దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. నిన్న(బుధవారం) మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 182 మండలాల్లో 4,159 సర్పంచ్ స్థానాలకు, 36452 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. డిసెంబర్ 5 వ తేదీన నామినేషన్ల స్వీకరణకు లాస్ట్ డేట్ గా ప్రకటించారు. డిసెంబర్ 6 తేదీన నామినేషన్ల పరిశీలిస్తారు. ఏడో తేదీన అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ అవకాశం కల్పిస్తారు. అదే రోజున వ్యాల్యూడ్ నామినేషన్ల ప్రకటన వెలువడుతుంది. చివరి దఫా పోలింగ్ డిసెంబర్ 17న నిర్వహిస్తారు.
READ MORE: South Africa vs India: టీమిండియా ఘోర ఓటమి.. రెండో వన్డేలో సత్తా చాటిన సఫారీలు
