Site icon NTV Telugu

Sarpanch Eligibility: గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలి అనుకుంటున్నారా? ఉండాల్సిన అర్హతలు ఇవే..

Elections

Elections

Sarpanch Eligibility: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ (EC). గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణీకుముదిని సోమవారం విడుదల చేశారు. తొలుత మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరం మొత్తం ఐదు దశల్లో జరగనుంది. మండల, జిల్లా పరిషత్‌ల తొలి విడత ఎన్నికలు అక్టోబర్‌ 23న, రెండో విడత అదే నెల 27న జరగనున్నాయి. గ్రామ పంచాయతీల మొదటి దశ ఎన్నికలు అక్టోబర్‌ 31న, రెండో విడత నవంబర్‌ 4న, మూడో దశ ఎన్నికలు అదే నెల 8న జరగనున్నాయి. అయితే.. ఈ సారి యువత పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి..? అనే అంశాన్ని తెలుసుకుందాం..

READ MORE: H-1B Visa: అమెరికన్ కంపెనీల చూపు భారత్ వైపు..హెచ్‌1బీ వీసా ఎఫెక్ట్..

అర్హతలు:
1. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి.
2. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి.
3. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది.
5. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.

అనర్హులు ఎవరంటే:
1. గ్రామ సేవకులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు సర్పంచ్ పోటీకి అనర్హులు.
2. చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన ఉద్యోగులు పోటీకి అనర్హులు.
3. నేరానికి పాల్పడి శిక్ష పడిన వారు పోటీకి అనర్హులు.
4. నేర శిక్షను అనుభవించిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి కాని వారు కూడా అనర్హులు.
5. మతిస్థిమితం లేని వారు.బదిరులు, మూగవారు అనర్హులు.
6. పౌరహక్కుల పరిరక్షణచట్టం–1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు .
7. దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు.రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి అనర్హుడు.
8. గ్రామ పంచాయతీ కి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు.బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు.
9. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే.
10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఏదైనా అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు.
11. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా

Exit mobile version