Site icon NTV Telugu

Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు!

Telangana Local Body Elections

Telangana Local Body Elections

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది.

Also Read: Niloufer Cafe Babu Rao: నీలోఫర్ కేఫ్‌ ఓనర్ భారీ కానుక.. శ్రీవారికి నాలున్నర కోట్ల విలువైన యజ్ఞోపవేతం!

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా సర్పంచ్ సహా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల తరవాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంనే లోకల్ బాడీ ఎలక్షన్‌లలో పునరావృతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి 20 నెలలు పూర్తయ్యాయి. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తానికి డిసెంబర్‌లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.

Exit mobile version