Site icon NTV Telugu

Telangana Lightning Tragedy: తెలంగాణలో దారుణం.. పిడుగు పాటుకు ఆరుగురు మృతి..

Pidugu

Pidugu

Telangana Lightning Tragedy: పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిర్మల్‌, జోగులాంబ గద్వాల్ జిల్లాల పరిధిలో ఆరుగురు పిడుగు పాటుకు బలయ్యారు. నిల్మల్ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్‌లో ముగ్గురు మృతి చెందారు. మృతులు బండారి వెంకటి, అల్లెపు ఎల్లయ్య అల్లెపు ఎల్లవ్వగా గుర్తించారు. మరోవైపు.. జోగులాంబ గద్వాల్‌ జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామంలో బుధవారం సాయంత్రం పత్తి చేనులో పని చేసుకుంటున్న కూలీలపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని‌ చికిత్స కోసం గద్వాల జిల్లా‌ ఆసుపత్రికి తరలించారు.‌ మృతులను భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్‌ (20), సౌభాగ్యమ్మ (40)గా గుర్తించారు.

READ MORE: TG News: రైతులకు గుడ్‌న్యూస్.. సాదాబైనామాలపై నోటిఫికేషన్‌ విడుదల

Exit mobile version