Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Kumbh Mela Medaram Sammakka Saralamma Jatara Begins Today

Medaram Jatara: తెలంగాణ కుంభమేళాకు వేళాయె.. నేటి నుంచే మేడారం జాతర ప్రారంభం!

Published Date :January 28, 2026 , 7:40 am
By Kothuru Ram Kumar
Medaram Jatara: తెలంగాణ కుంభమేళాకు వేళాయె.. నేటి నుంచే మేడారం జాతర ప్రారంభం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Medaram Jatara: అడవి తల్లీ బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నేడు (బుధవారం) అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Without Ticket Flight Journey: మనవడికి టికెట్ తీసుకోకుండా ఫ్లైట్ ఎక్కించిన బామ్మ.. చివరికి.?

నేటి ప్రత్యేకత:
జాతర తొలిరోజైన బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారం పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కోలాహలం మొదలవుతుంది. కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు. అదే సమయంలో కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించడంతో జాతర అంకురార్పణ జరుగుతుంది. రేపు (గురువారం) సాయంత్రం చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో జాతర తార స్థాయికి చేరుకుంటుంది.

జాతర అధికారికంగా నేడు ప్రారంభమైనప్పటికీ.. గత వారం రోజులుగానే మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగు వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. భారీగా వాహనాలు తరలివస్తుండటంతో బుధవారం వేకువజామునే సుమారు 4 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Road Accident: అతివేగం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి..!

అతిపెద్ద ఆదివాసీ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 21 శాఖల నుంచి 42,027 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇంకా భక్తుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇక వాహనాల కోసం 1,418 ఎకరాల్లో 42 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. జాతర ప్రాంతాన్ని 8 అడ్మినిస్ట్రేటివ్ జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

జనవరి 30, 31 తేదీల్లో భక్తులు భారీ ఎత్తున నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు దేవతలందరూ తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ మహా జాతర ముగుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asia largest tribal fair
  • medaram
  • MEDARAM JATARA
  • Medaram Jatara dates
  • Medaram tribal festival

తాజావార్తలు

  • UDAN Scheme 2.0: దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్స్..

  • Dhurandhar 2: ధురంధర్-2 క్లైమాక్స్‌ సాంగ్ వైరల్.. అసలెవరు ఈ “రాస్‌పుటిన్”, ఐఎస్ఐ అధికారి పాత్రతో సంబంధం ఏమిటి..?

  • US – Cuba War: ట్రంప్ ‘వార్’ వార్నింగ్.. క్యూబాపై యుద్ధ మేఘాలు! అమెరికా తదుపరి టార్గెట్ ఇదేనా?

  • Telangana Assembly: ఆ సారా తాగడం వల్లనే 100 ఏళ్లు బతికారు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Vijayawada: టెర్రర్ లింకుల కేసులో ఇద్దరు అరెస్ట్.. వెలుగులోకి కొత్త నిజాలు.!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions