New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!

New Electricity Connection

New Electricity Connection

New Electricity Connections: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పులు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

Philips: ఫిలిప్స్ సౌండ్‌బార్లు, హెడ్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్లు రిలీజ్.. ప్రారంభ ధర రూ.899..!

ఇప్పటివరకు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం డిస్కమ్స్ స్తంభాలు, లైన్ల దూరాన్ని ఆధారంగా చేసుకుని వినియోగదారుల నుంచి వివిధ రకాల ఛార్జీలు వసూలు చేసేవి. దీంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఫీజులు విధించేవారు. ఈ విధానానికి ముగింపు పలుకుతూ.. ఇకపై కొత్త కనెక్షన్లకు ఫిక్స్డ్ ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది.

Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?

కొత్త మార్గదర్శకాల ప్రకారం గృహ వినియోగదారుల కోసం ఛార్జీలను 1 కిలోవాట్ వరకు రూ.500, 1 నుంచి 5 కిలోవాట్ల వరకు: రూ.500 + ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.600 లా నిర్ణయించారు. అంటే వినియోగదారులు ఇకపై దూరం, స్తంభాలు, లైన్ల పేరుతో అదనపు భారాన్ని భరించాల్సిన అవసరం ఉండదు. రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ఫీజు విధానం అమలులోకి రానుంది.