NTV Telugu Site icon

Inter Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైన నో ఎంట్రీ..

Inter

Inter

Telangana Intermediate Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగనున్నాయి. అయితే, పరీక్ష సెంటర్ కు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి స్టూడెంట్స్ ను అనుమతించమని.. ఆలస్యం కాకుండా చూసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించింది.

Read Also: Weight Loss Tips: నిమ్మరసంలో వీటిని కలిపి తాగితే చాలు.. 15 రోజుల్లో బరువు తగ్గుతారు…

అయితే, దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాయనున్న ఈ పరీక్షలకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. పకడ్బందీ ఏర్పాట్లతో పాటు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక, విద్యార్థుల హాల్‌ టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచడంతో.. వారు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటిపై ప్రిన్సిపాళ్ల సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లకు ఇంటర్‌ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. హాల్‌ టికెట్‌లో పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టుల వివరాల్లో తప్పులు ఉంటే కళాశాల ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

Read Also: Duddilla Sridhar Babu : ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా పని చేస్తోంది

ఇక, స్టూడెంట్స్ డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 4 లక్షల 78వేల 718 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ పరీక్షలు రాయనున్న 5 లక్షల 2 వేల 260 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇక, పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారుల సమన్వయంతో ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల తరవాత పరీక్ష హల్ లోకి పర్మిషన్ ఉండదని ఇంటర్ బోర్డు సెక్రెటరీ వెల్లడించింది. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్త్ క్యాంప్ ఏర్పాటుతో చేశారు. అలాగే, ఎగ్జామ్ టైమింగ్స్‌ దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని.. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని పేర్కొన్నారు.

Read Also: LIC Policy: ఆడపిల్లల కోసం అదిరిపోయే పాలసీ.. రోజుకు రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు పొందవచ్చు..

అలాగే, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే డిబార్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు ప్రశాంతంగా ఎక్సామ్ రాయాలని సూచించారు. ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే విద్యార్థుల కోసం టెలి మానస్ పేరుతో14416 లేదా 1800-914416 టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది 9 లక్షల 80వేల 978మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. 27 వేల 900 మంది ఇన్విజిలేటర్లు, 75 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 1521 మంది చీఫ్ సూపర్డేట్స్, 200 మంది సీటింగ్ గార్డ్స్ ఉంటారని వెల్లడించింది.