TGBIE: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన..

  • సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి
  • మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు సెలవులు
  • ఈ షెడ్యూల్ను కచ్చితంగా పాటించాలని ఇంటర్ బోర్డు ఆదేశం
  • జూన్ 2, 2025 నుంచి తరగతులు పునః ప్రారంభం
Inter

Inter

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుంచి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

READ MORE: Pawan Kalyan: హరిహర వీరమల్లు క్లైమాక్స్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

విద్యార్థులు వేసవి సెలవులను స్వీయ అధ్యయనం, నైపుణ్యాల అభివృద్ధి, ఇతర ప్రయోజనకరమైన కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సూచించింది. జూన్ 2, 2025 నుంచి తరగతులు మళ్లీ ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. అలాగే, సెలవుల సమయంలో అనధికారికంగా తరగతులను నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.