NTV Telugu Site icon

TS Inter Hall Tickets: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!

Ts Inter Exams

Ts Inter Exams

తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు విడుదలయ్యాయి. వాటిని ఇంటర్మీడియట్ బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేసింది. కాగా.. ఇంతకుముందు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఉండేది. కానీ తాజాగా.. విద్యార్థులే నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాశ్ని కల్పించింది. అయితే.. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగనున్నాయి. ఈ సంవత్సరంలో 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని బోర్డు తెలిపింది.

Read Also: Harish Rao: ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదు..

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
1. TSBIE అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in ను సందర్శించండి.
2. ఆ తర్వాత హోమ్‌పేజీలో తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండియర్ హాల్ టికెట్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
3. లాగిన్ పేజీలో టీఎస్ ఇంటర్ ప్రథమ లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ కోసం రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
4. ఆ తర్వాత హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.

Read Also: YSRCP: సీఎం జగన్‌ అధ్యక్షతన ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం

పరీక్ష తేదీలు
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 18 వరకు జరుగుతాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29న ప్రారంభమై మార్చి 19 వరకు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
28-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
01-03-2024 – ఇంగ్లీష్ పేపర్-I
04-03-2024 – గణితం పేపర్-IA / బోటనీ పేపర్-I / పొలిటికల్ సైన్స్ పేపర్-I
06-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IB / జువాలజీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
11-03-2024 – ఫిజిక్స్ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-I
13-03-2024 – కెమిస్ట్రీ పేపర్-I / కామర్స్ పేపర్-I
15-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
18-03-2024 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
29-02-2024 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
02-03-2024 – ఇంగ్లీష్ పేపర్-II
05-03-2024 – గణితం పేపర్-IIA / బోటనీ పేపర్-II / పొలిటికల్ సైన్స్ పేపర్-II
07-03-2024 – మ్యాథమెటిక్స్ పేపర్-IIB / జువాలజీ పేపర్-II / హిస్టరీ పేపర్-II
12-03-2024 – ఫిజిక్స్ పేపర్-II / ఎకనామిక్స్ పేపర్-II
14-03-2024 – కెమిస్ట్రీ పేపర్-II / కామర్స్ పేపర్-II
16-03-2024 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
19-03-2024 – మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ పేపర్-II