NTV Telugu Site icon

TS Inter Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు…ఎలా తెలుసుకోవచ్చంటే?

Ap Inter Results

Ap Inter Results

విద్యార్ధులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేశారు. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సంప్రదించిన అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు.ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Read Also: The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ చూడమని కోరినందుకు వ్యక్తిపై దాడి

జీరో సాంకేతిక సమస్యలు వచ్చాయని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫలితాలు వెల్లడించేందుకు అంతా సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ పరీక్షలకు 4,82,501 మంది విద్యార్ధులు హాజరయ్యారు. సెకండియర్ పరీక్షలకు 4,23, 901 మంది విద్యార్ధులు హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోనే పూర్తయింది. ఫలితాలు విడుదల చేయనుండడంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ నెలకొంది.

Read Also: Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. సెకండ్ యంగెస్ట్ ప్లేయర్