Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ (CURE) పరిధిలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది లబ్ధిదారులు ఈ కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా పనులను శరవేగంగా పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి ఆయన ఈ పథకం బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ పథకం కింద తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇళ్లను నిర్మించనున్నారు. త్వరలోనే మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఈ పథకాన్ని విస్తరిస్తారు. అర్హులైన వారు జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు మీసేవ, అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.10 వేలుగా నిర్ణయించారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read
- Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
- MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
- Koti Deepotsavam 2026: వైభవంగా కోటి దీపోత్సవం.. ఐదో రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవే..
ఇందులో 525 చదరపు అడుగుల వైశాల్యంతో 1BHK (బెడ్రూమ్, హాల్, కిచెన్) ఫ్లాట్లను పేదల నివాస ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షలను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఉచితంగా ఇస్తుంది. మిగిలిన లబ్ధిదారుని వాటా రూ.6 లక్షలను నాలుగు వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు. దీనితో పాటు రూ.40-60 లక్షల విలువైన స్థలాన్ని లబ్ధిదారులైన ఆడపడుచుల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఈ ఆస్తిని 10 ఏళ్ల వరకు అమ్ముకోవడానికి వీల్లేదు, కానీ బ్యాంకు రుణం కోసం తాకట్టు పెట్టుకోవచ్చు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. అలాగే క్యూర్ పరిధిలో వారికి ఎలాంటి సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఒక కుటుంబం నుండి ఒకే దరఖాస్తును స్వీకరిస్తారు. ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. ఒకవేళ అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే బహిరంగ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇల్లు మంజూరు కాని వారికి దరఖాస్తు రుసుము రూ.10,000 తిరిగి చెల్లిస్తారు. పేదలతో పాటు త్వరలోనే మధ్యతరగతి ప్రజలకు కూడా ఇళ్ల విషయంలో శుభవార్త చెప్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
ట్రెండింగ్
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!