NTV Telugu Site icon

TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

Tg Icet Result

Tg Icet Result

ICET Results 2024: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. ఐసెట్‌ పరీక్ష కోసం 86 వేల 156 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఎంబీఏ 272 కాలేజీల్లో 35 వేల 949 సీట్లు ఉండగా.. ఎంసీఏ 64 కాలేజీల్లో 6 వేల 990 సీట్లు ఉన్నాయి. ఐసెట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77,942 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఐసెట్‌ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. కాగా తెలంగాణ ఐసెట్‌ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

 

ఫలితాల కోసం.. క్లిక్ చేయండి.

 

రిజల్ట్ చూడండి ఇలా..

icet.tsche.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్‌పేజీలో TS ICET 2024 ఫలితాలను తనిఖీ చేయడానికి లింక్ కోసం చూడండి. దాన్ని క్లిక్ చేయండి

కొత్త పేజీ పాపప్ అవుతుంది. అభ్యర్థులు లాగిన్ వివరాలను సమర్పించాలి

లాగిన్ వివరాలను సమర్పించిన తర్వాత, అభ్యర్థులు తమ ఫలితాలను చూడవచ్చు

స్కోర్ కార్డ్‌లోని వివరాలను ధృవీకరించండి. పేజీని సేవ్ చేయండి

భవిష్యత్తు అవసరాల కోసం పేజీని డౌన్‌లోడ్ చేసి, స్కోర్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

Show comments