ఎన్నికల వివాదాల కేసులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరో 28 ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వేగంగా జరుగుతుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read Also: Minister KTR: మూసారం బాగ్ బ్రిడ్జి వద్ద మూసి నదిని పరిశీలించిన మంత్రి కేటీఆర్
ఇక తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
Read Also: Dil Se: బేబీ బాటలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ‘దిల్ సే’గా ఆగస్టు 4న రిలీజ్!
2018 ఎన్నికల్లో అఫిడవిట్ లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు నివేదిక సమర్పించారని హైకోర్టును సమీప అభ్యర్ధి జలగం వెంకటరావు ఆశ్రయించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నికను రద్దు చేస్తూ ఈనెల 25వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ నిన్న (బుధవారం) వనమా వెంకటేశ్వరరావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం వనమా విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకటరావును అసెంబ్లీ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేదా అనేది వేచి చూడాలి.