Site icon NTV Telugu

Telangana High Court: జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

Telangana High Court: ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో దివాకర్‌ ట్రావెల్స్‌ BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకు గానూ ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ కేసును సీబీఐకి విచారణకు అప్పగించాలని పిటిషన్‌ వేశారు. 2020, అక్టోబర్‌ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని తన పిటిషన్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: Andhrapradesh: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ ప్రతినిధుల బృందం

ఈ క్రమంలోనే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన కోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని కోరుతూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్‌, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభాకర్‌ రెడ్డిని నోటీసుల్లో హైకోర్టు ఆదేశించింది.

Exit mobile version