TS High Court: పోలీస్‌స్టేషన్‌కు సరదాగా ఎవరూ రారు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS High Court: పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల కోసం పోలీసులున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. పోలీసు విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందన్న హైకోర్టు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని డీజీపీని ఆదేశించింది. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా.. కరీంనగర్ 2వ పట్టణ పీఎస్‌లో మహిళ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సీజే ధర్మాసం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశంతో వ్యక్తిగతంగా ఎస్హెచ్ఓ ఓదెల వేంకటేశ్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ.. 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణలు కోరారు.
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు తెలిపింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని ధర్మాసనం వెల్లడించింది. ఎస్హెచ్ఓ ఎఫ్ఐర్ నమోదు చేయకపోవడానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!