NTV Telugu Site icon

Telangana : అరె ఏంట్రా ఇది.. ఆ పని చేసి అడ్డంగా బుక్కయిన దొంగ..

Thieff

Thieff

ఎక్కడైనా దొంగలు దొంగతనానికి వస్తే దొరికినకాడికి దోచుకుపోతారు.. కానీ ఇటీవల కొన్ని దొంగతనాలు మాత్రం జనాలను పొట్ట చెక్కలయ్యేలా చేస్తున్నాయి.. ఈ మధ్య దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఏదోక చిన్న పని చేసి అడ్డంగా దొరికిపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణాలో వెలుగు చూసింది..

దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రలోకి జారుకున్నాడు.. ఇక ఏముంది అక్కడ వాళ్లకు దొరికాడు.. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంక్యాంపులో జరిగింది. బోర్లంక్యాంపు గ్రామానికి చెందిన కుర్మ రాజు దంపతులు ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లారు.. పక్క గ్రామానికి చెందిన బత్తుల మోహన్‌ అనే దొంగ దొంగతనానికి వెళ్లాడు.. బీరువాను ధ్వంసం చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి, ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ఇక అలా మధ్యలో నిద్ర రావడంతో గ్రామ సమీపంలోని ఓ చెట్టు కింద నిద్రకు ఉపక్రమించి, గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సోమవారం ఉదయం 5 గంటలకు రాజు రాగా, ఇంటి తాళాలు పగులకొట్టి ఉండటం, బీరువా ధ్వంసం చేసి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.. అయితే కొందరు యువకులు అటుగా వెళ్తు అతనిపై అనుమానం రావడంతో అతని దగ్గర బంగారం ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఆరు తులాల బంగారు ఆభరణాలు దొరికాయి. మోహన్‌ను పోలీసులకు అప్పజెప్పారు. చోరీకి గురైన సొత్తు దొరకడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.. ఆ దొంగను అరెస్ట్ చేశారు..