Telangana : అరె ఏంట్రా ఇది.. ఆ పని చేసి అడ్డంగా బుక్కయిన దొంగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైనా దొంగలు దొంగతనానికి వస్తే దొరికినకాడికి దోచుకుపోతారు.. కానీ ఇటీవల కొన్ని దొంగతనాలు మాత్రం జనాలను పొట్ట చెక్కలయ్యేలా చేస్తున్నాయి.. ఈ మధ్య దొంగతనం కోసం వచ్చిన దొంగలు ఏదోక చిన్న పని చేసి అడ్డంగా దొరికిపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణాలో వెలుగు చూసింది..
దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రలోకి జారుకున్నాడు.. ఇక ఏముంది అక్కడ వాళ్లకు దొరికాడు.. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంక్యాంపులో జరిగింది. బోర్లంక్యాంపు గ్రామానికి చెందిన కుర్మ రాజు దంపతులు ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లారు.. పక్క గ్రామానికి చెందిన బత్తుల మోహన్ అనే దొంగ దొంగతనానికి వెళ్లాడు.. బీరువాను ధ్వంసం చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి, ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.
Also Read
ఇక అలా మధ్యలో నిద్ర రావడంతో గ్రామ సమీపంలోని ఓ చెట్టు కింద నిద్రకు ఉపక్రమించి, గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సోమవారం ఉదయం 5 గంటలకు రాజు రాగా, ఇంటి తాళాలు పగులకొట్టి ఉండటం, బీరువా ధ్వంసం చేసి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.. అయితే కొందరు యువకులు అటుగా వెళ్తు అతనిపై అనుమానం రావడంతో అతని దగ్గర బంగారం ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఆరు తులాల బంగారు ఆభరణాలు దొరికాయి. మోహన్‌ను పోలీసులకు అప్పజెప్పారు. చోరీకి గురైన సొత్తు దొరకడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.. ఆ దొంగను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ హరర్ థ్రిల్లర్ ‘418’కు ‘ఏ’ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
Astrology: సెప్టెంబర్ 11 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికే డబ్బులే డబ్బులు..!
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?