NTV Telugu Site icon

TG News: చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల..

Hmpv

Hmpv

చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది.. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల డేటాను ఆరోగ్య శాఖ విశ్లేషించింది. 2023తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో గణనీయమైన పెరుగుదల లేదు.. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల పై పాటించాల్సిన జాగ్రత్తలను విడుదల చేసింది.

Read Also: Amit Shah: ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్‌ విలాసాలు.. అమిత్ షా విమర్శలు

చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది. మరోవైపు.. అంతర్జాతీయ నివేదికలు ప్రస్తుతానికి చైనాకు ట్రావెల్ ప్లాన్స్‌ని పున:పరిశీలించాలని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చైనా వ్యాప్తంగా ముఖ్యంగా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో HMPV వైరల్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇన్‌ఫ్లూఎంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి కేసులతో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.

Read Also: Minister Anagani Satya Prasad: లోకేష్‌ నిర్మాణాత్మక చర్యలు.. కాలేజీల్లో హాజరు శాతం పెరుగుతుంది..!

Show comments