Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Graduate Voter Registration: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు కావడానికి ఎపిక్ (EPIC) నంబర్ వివరాలు తప్పనిసరి కాదని స్పష్ట చేసింది. ఎపిక్ నంబర్ వివరాలు ఇవ్వాలని పట్టభద్రులపై ఎన్నికల అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎపిక్ నంబర్ వివరాలు అందించలేదనే ఏకైక కారణంతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం సమర్పించిన ఫారం-18 దరఖాస్తులను తిరస్కరించకూడదని తెలిపింది. సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులు (DEOs), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (EROs) ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు జాబితాను సెప్టెంబర్‌లో ఈసీ విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం గతనెల 20న ఎన్నికల కమిషన్ పబ్లిక్ నోటీసు విడుదల చేసింది. ఇక, నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరించనుంది. నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనుంది. నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
తాజావార్తలు
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా అనుపమ్ ఖేర్!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!