దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. గతంలో ఉన్న లక్షను.. రూ.2 లక్షల కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటేనే ఈ పెంచిన నగదు ప్రోత్సాహకం లభించనున్నది. ఈ రూ.2 లక్షల ను భార్య పేరు మీద ప్రభుత్వం ఇవ్వనున్నది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా వారికి ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందనుంది. ఇప్పటి వరకూ ఒకరు దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు కాగా.. మరొకరు సాధారణ వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఈ పథకం వర్తించేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ప్రభుత్వం వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.