Site icon NTV Telugu

DSC: డీఎస్సీ 2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Dsc

Dsc

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది. 30 శాతం రిజర్వేషన్‌ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. అయితే.. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుంది. అంతేకాకుండా.. 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

Read Also: Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్‌ వాక్..

మరోవైపు.. 2008 డిసెంబర్ 6న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం 35 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేస్తామని.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులుగా నోటిఫికేషన్ ఇచ్చింది. కాగా నోటిఫికేషన్ విడుదల చేసిన 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29న జీవో-28ని తీసుకొచ్చింది. దీంతో బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో.. కోర్టు కామన్‌ మెరిట్‌ ప్రకారం భర్తీ చేయాలని తెలిపింది. దీంతో నోటిఫికేషన్‌ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని నియామక కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్‌ మెరిట్‌ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైంది.

Read Also: Mpox Clade 1b: ఇండియాలో తొలిసారిగా ప్రమాదకరమైన ఎంపాక్స్ వెరైటీ గుర్తింపు..

Exit mobile version