Ration Card E-KYC: ఇప్పటి వరకు రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వారికి గుడ్‌న్యూస్ చెబుతూ.. మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ముందుగా విధించిన గడువు ప్రకారం జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో ముగియనుంది.. గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E-KYC అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు.. కొన్ని రేషన్ షాపుల దగ్గర భారీ లైన్లు దర్శనం ఇవ్వడంతో.. అప్‌డేట్ చేసుకోవడానికి కొందరు ముందుకు రాని సందర్భాలు ఉన్నాయి.. KYC అప్‌డేట్ కోసం ఆధార్ ధృవీకరణ మరియు వేలిముద్రలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాకపోతే వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోత పెట్టే అవకాశం లేకపోలేదు.. దీంతో.. మరో నాలుగు రోజులే మిగిలి ఉంది అనే ఆందోళన రేషన్ కార్డు దారుల్లో మొదలైంది.. ఇక, అలాంటి వారికి టెన్షన్ లేకుండా.. మరో నెలరోజుల పాటు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం..
Read Also: Bhatti Vikramarka: బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నాం..
ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చు అని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయడమే లక్ష్యంగా ఉండాలని.. కానీ, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 75.76 శాతం మాత్రం రేషన్‌కార్డు దారుల మాత్రమే ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకున్నారు. మిగతావారు కూడా వెంటనే అప్‌డేట్ చేసుకుని విధంగా ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ-కేవైసీ గడువు పొడిగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది పౌరసరఫరాల శాఖ..
Read Also: Konda Vishweshwar Reddy Face To Face: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ..
కాగా, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. కానీ బోగస్ రేషన్ కార్డులను ఆధార్ నంబర్‌తో రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలని ఎరివేత సంస్థ నిర్ణయించింది. దీనికి కారణాలు లేకపోలేదు. చాలా పాత కార్డుల్లో చనిపోయిన వారి పేర్లే ఉన్నాయి. దీంతో రేషన్ సరుకులు పక్కదారి పడుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. కుటుంబంలో చాలా మంది లబ్ధిదారులు ఉంటే, వారందరూ E-KYC చేయాలి. మరోవైపు కొత్త రేషన్ కార్డుల ఆమోదానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న విషయం విదితమే.