RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం పునఃపరిశీలన..
- ఛార్జీలు తగ్గించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన..
- ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో సమీక్షకు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ కామన్ పాస్ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో రవాణా శాఖ స్పందించింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కామన్ పాస్ ధరలను పునఃసమీక్షించనున్నట్లు కీలక ప్రకటన చేశారు.
ప్రజా రవాణాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ సేవలు సామాన్యులకు మరింత అందుబాటులో ఉండేలా ఛార్జీలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల మేరకు త్వరలోనే రవాణా శాఖ, సంబంధిత ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కామన్ పాస్ ధరల తగ్గింపు , ప్రయాణికులకు ఎలాంటి ఆర్థిక భారం పడకుండా తగు మార్పులు చేర్పులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆందోళనలను సానుకూలంగా పరిశీలిస్తామని, సామాన్యులకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన సవరించిన విధివిధానాలు, కొత్త ధరల వివరాలు వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
తాజావార్తలు
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు