TG Govt: విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజలకు అండగా ప్రభుత్వం.. 24×7 కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇవే

Cm Revanth

Cm Revanth

Telangana Government: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం, సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

READ MORE: KTR: అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెర తీశారా? ఖబడ్దార్ అంటూ కేటీఆర్ ఫైర్..

24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
(న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)

వందన బరువా (పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్)
+91 9871999044

సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)
+91 9958322143

జావేద్ హుస్సేన్ (లైజన్ ఆఫీసర్)
9910014749

రక్షిత్ నాయక్ (లైజన్ ఆఫీసర్)
+91 9643723157

READ MORE: Vishnu Vinyasam : మిక్స్డ్ టాక్’తో 3 రోజుల్లో 14.7 కోట్లు కొల్లగొట్టిన శ్రీ విష్ణు