Site icon NTV Telugu

Increased Diet Charges: శుభవార్త చెప్పిన కేసీఆర్.. హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు భారీగా పెంపు

Kcr

Kcr

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, అనుబంధ హాస్టళ్ల డైట్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డైట్ ఛార్జీల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో పెరిగిన డైట్ ఛార్జీలు జులై నెల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో ప్రకటించింది. అయితే, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ. 950 నుంచి రూ.1,200లకు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వారికి 1,400, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ. 1,875లకు పెంచింది.

Read Also: IND vs BAN: కోపం మాములుగా లేదు.. నాటౌట్ను ఔట్ ఇవ్వడంతో..

డైట్​ చార్జీలను పెంచిన విషయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన చిత్రపటానికి పలు జిల్లాల్లో పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రభుత్వ బడుల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సర్కార్ బడుల్లో చదివే స్టూడెంట్స్ కు బట్టలు, బూట్లతో పాటు పుస్తకాలను కూడా కేసీఆర్ సర్కార్ అందిస్తుంది. రాష్ట్రంలో మెరుగైన విద్య కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది.

Read Also: Viral News: అయ్యా బాబోయ్.. ఇల్లు కావాలంటే అది ఉండాలా?

Exit mobile version