Site icon NTV Telugu

Irrigation Issues: నీటి పారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు

Telangana Govt

Telangana Govt

Irrigation Issues: నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ 3 లేఖలు రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్‌సీఈలతో సాంకేతిక బృందం ఏర్పాటు చేయాలని.. ఇందులో రాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని లేఖలో రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్రం జోక్యం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలని రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బ్యాక్‌ వాటర్ తెలంగాణలోకి రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. వీటితో పాటు మరో 2 అంశాలపై రాష్ట్రప్రభుత్వం వేర్వేరు లేఖలు రాసింది.

Etela Rajender: కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే..

కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల కాంపోనెంట్‌ను తొలగించాలని మరో లేఖలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితా నుంచి కాళేశ్వరంను తొలగించాలని.. పనుల ప్రక్రియ గోదావరి బోర్డు త్వరగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వీటితోపాటు అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖలో విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కారు కోరింది.

Exit mobile version