తెలంగాణ ప్రభుత్వం పలు పండగలకు సెలవులను ప్రకటించింది. దసరా పండగ సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అలాగే, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన రిలీజ్ చేసింది. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజులు దసరా సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలకు హాలీడేస్ ఇవ్వడంతో పాటు ఈ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగితా పండగల సెలవులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
Read Also: Prabhas: థియేటర్స్ అన్నీ డైనోసర్ ఇస్తే… కింగ్ ఖాన్ పరిస్థితి ఏంటో?
ఇందులో భాగంగా దసరా తర్వాత వచ్చే దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇవ్వడంతో పాటు డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ పండగకు ఐదు రోజులు సెలవులు ఇచ్చింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇతర స్కూళ్లకు మాత్రం ఒక్క రోజే హాలీడే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి కేవలం ఆరు రోజులు మాత్రమే సెలవులను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. బోగి, సంక్రాంతి, కనుమ పండగలతో కలిపి 6 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: Penalty on LIC: ఎల్‌ఐసికి ఐటీ శాఖ రూ.84 కోట్ల జరిమానా.. కోర్టులో అప్పీల్ చేయనున్న బీమా సంస్థ
ఇక, ఏపీ ప్రభుత్వం కూడా దసరా పండగకు సెలవులు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వుల జారీ చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ సెలవులు అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు మాత్రమే.. 26వ తేదీ నుంచి స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి.