Site icon NTV Telugu

Holiday: జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Ts

Ts

New Year celebrations: న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. పబ్ లు, క్లబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రి ఒంటి గంట వరకు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు చెప్పారు.

Read Also: Uddhav Thackeray: ఈ సారి ఆ తప్పు చేస్తే దేశంలో నియంతృత్వమే.. ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు..

ఈ క్రమంలోనే జనవరి 1న తెలంగాణ సర్కార్ సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1ని జనరల్ హాలిడేగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లే వారు, పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు ఇచ్చారు. పార్టీలలో డ్రగ్స్ వినియోగం లేకుండా చూసుకోవాలి.. ఒకే వేళ డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version