Breaking News : ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే ముత్తి రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం కీకల నిర్ణయం తీసుకుంది. తాజాగా టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిని, రైతు బంధు సమితి చైర్మన్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు.. ఎంబీసీ చైర్మన్ గా నందికొండ శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్‌లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యను రైతుబంధు చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనకు కార్పొరేషన్ బాధ్యతలను అప్పగించింది.
Also Read : Tara Shahdeo: షూటర్ తారా “లవ్ జిహాద్” కేసు.. మాజీ భర్తకు జీవిత ఖైదు
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
అయితే.. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు తాటికొండ రాజయ్య. అదే విధంగా మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవల కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్‌ను నియమించారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. అదే విధంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్లు కొనసాగుతారు. జనగాం ఎమ్మెల్యే టికెట్‌ను అధిష్టానం కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌గా నియమించింది. ఈ నియామక ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముత్తిరెడ్డి ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
Also Read : AP CM JAGAN: ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ భేటీ
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!