Site icon NTV Telugu

Sarayu River: సరయూ నదిలో కొట్టుకుపోయిన తెలంగాణ యువతి..

Sarayu River Ayodhya

Sarayu River Ayodhya

A Bir Missing in Sarayu River: అయోధ్యకు తీర్థయాత్రకు వెళ్లిన జనగాం జిల్లాకు చెందిన 16 ఏళ్ల యువతీ స్నాన ఘాట్‌లో స్నానం చేస్తుండగా, ఎగువ నుంచి నదిలోకి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో సరయూ నదిలో కొట్టుకపోయింది. జనగాం లోని ఏబీవీ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తేజస్విని (16) మూడు రోజుల క్రితం తన కుటుంబంలోని మరో 15 మంది సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లింది. అయోధ్య లోని రామమందిరం, ఇతర ఆలయాలను సందర్శించిన తర్వాత.. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం 8 గంటలకు లక్ష్మణ్ ఘాట్‌ లో పవిత్ర స్నానం చేయడానికి వెళ్ళింది. అకస్మాత్తుగా, సరయు నదికి ఎగువన నీటిని విడుదల చేయడంతో స్నాన ఘాట్ వద్ద నీటి మట్టం పెరిగింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు సురక్షితంగా చేరుకోగా తేజస్విని వరదలో కొట్టుకుపోయింది.

LULU Mall: FSSAI నుండి 5 స్టార్ రేటింగ్ ను అందుకున్న లులు మాల్..

ఆమె కుటుంబం ఏదైనా శుభవార్త కోసం ఆశతో ఉండగా., మంగళవారం నాటికి తేజస్విని ఆచూకీ లభించక పోవడంతో అధికారులతో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ ల ఆందోళన.. తగ్గేదే లేదంటూ..

Exit mobile version