NTV Telugu Site icon

Success Story: ఇస్రోకు నో చెప్పి.. రూ.52 లక్షల కొలువు పట్టేసింది.. రైతుబిడ్డ సక్సెస్‌ స్టోరీ..

Success Story

Success Story

Success Story: ప్రస్తుతం బీటెక్‌ పూర్తి చేసి మంచి ఐటీ కంపెనీలో జాబ్‌ సాధించాలి, అలా అయితేనే లక్షల్లో ప్యాకేజీ దక్కుతుందని చాలా మంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కృషి చేస్తే సాఫ్ట్‌వేర్‌లోనే కాదు.. హార్డ్‌వేర్ రంగంలోనూ లక్షల్లో వేతనం అందుకోవచ్చని నిరూపించింది ఓ రైతు బిడ్డ. రైతు కుటుంబంలో పుట్టిన ఆ యువతి.. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసింది. అది చూసి బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఏకంగా ఇస్రోలో వచ్చిన జాబ్‌ ఆఫర్‌ను కూడా వదులుకుని.. ఆ తర్వాత ఏడాదికే రూ.52 లక్షల ప్యాకేజీని సంపాదించింది రైతుబిడ్డ మూల ఆశ్రిత. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించింది.

Read Also: Uttar Pradesh: సజీవంగా వ్యక్తి సమాధి.. వీధి కుక్కలు రక్షించాయి..

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన మూల ఆశ్రిత తల్లిదండ్రులకు వ్యవసాయం గురించి తప్ప ఇంకేమి తెలియదు. ఆ యువతి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి చదువు గురించి పెద్దగా తెలియదు.. కానీ తమ బిడ్డను బాగా చదివించాలని భావించారు. ఇక ఆశ్రిత కూడా చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది. దీంతో ఇంటర్ పూర్తికాగానే తెలిసిన వారి సలహాతో ఇంజినీరింగ్ కాలేజీలో చేరిపోయింది. బీటెక్‌ పూర్తయ్యాక అందరిలా సాఫ్ట్‌వేర్‌ రంగంవైపు వెళ్లేందుకు ఇష్టపడ లేదు. అందుకు భిన్నంగా హార్డ్‌వేర్ రంగాన్ని ఎంచుకుంది. ఐఐటీల్లో ఎంటెక్‌ చేయాలని భావించింది. గేట్‌ కోచింగ్ తీసుకుని ఎలాగైనా ఐఐటీలో చేరాలని బాగా చదివింది. మొదటిసారి విఫలమైనా రెండో ప్రయత్నంలో 2022లో ఆలిండియా 36వ ర్యాంకు సాధించి నచ్చిన ఐఐటీలో చేరింది. 2024లో ఎంటెక్‌ పూర్తి చేసింది.

Read Also: Swapnil Kusale: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన స్వప్నిల్‌కు రైల్వే గిఫ్ట్..

2022లో గేట్‌ ఆలిండియా 36వ ర్యాంకు రావడంతో ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్‌, ఎన్పీసీఐఎల్ వంటి సంస్థల్లో అవకాశాలు తలుపుతట్టాయి. అయినా ఆ ఉద్యోగాలను వద్దనుకుంది. బెంగళూరు ఐఐటీలో ఎంటెక్‌ పూర్తి చేసింది. ఇక తాజాగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా మంచి అవకాశాలు అందుకోవచ్చని ఆశ్రిత నిరూపించింది. ఆమె సాధించిన విజయాన్ని చూసి తల్లిదండ్రులతో పాటు కోచింగ్ ఇచ్చిన గురువు చింతల రమేష్ గర్వపడుతున్నారు. బీటెక్ పూర్తయ్యాక గేట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే కోరిక రిగా అకాడమీలో చేరాకే నెరవేరిందని ఆశ్రిత అంటోంది. గురువు చింతల రమేష్ గైడెన్స్ వల్లే ఈ స్థాయికి చేరగలిగానని హర్షం వ్యక్తం చేస్తోంది.

2022 గేట్‌లో ఆలిండియా 36వ ర్యాంకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వరుస కట్టాయి. ఇస్రో, డీఆర్డీవో, బార్క్‌, ఎన్పీసీఐఎల్​ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో జాబ్‌ అవకాశాలు తలుపు తట్టినా బెంగుళూరు ఐఐటీలో ఎంటెక్‌ వైపే మొగ్గు చూపింది. ఈ మధ్యే ఎంటెక్‌ పూర్తి చేసిన ఆశ్రితకు ప్రాంగణ నియామకాల్లో ఎన్విడియా అనే బహుళజాతి సంస్థలో ఏకంగా 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం వరించింది. బీటెక్ పూర్తయ్యాక గేట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే ఆకాంక్ష రిగా అకాడమీలో చేరాకే నెరవేరిందని అంటోంది ఆశ్రిత. గురువు చింతల రమేశ్​ మార్గనిర్దేశం వల్లే ఈ స్థాయికి చేరగలిగానని ఆనందం వ్యక్తం చేస్తోంది. గేట్‌ కోచింగ్‌కు డబ్బు కట్టలేని వారు ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తున్న రిగా అకాడమీ సేవలను వినియోగించుకోవాలని కోరుతోంది.

Show comments