NTV Telugu Site icon

Exam Postponed: తెలంగాణ జెన్ కో రాత పరీక్ష వాయిదా

Ts Genco

Ts Genco

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్ కో రాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వచ్చింది. ఈ పరీక్ష ఈనెల 17న జరగాల్సి ఉంది.. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు జెన్ కో తెలిపింది.

Read Also: V.H: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్..

కాగా.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్) మరియు కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నెల 17వ తేదీన పరీక్ష నిర్వహించాలనుకోగా.. అదే రోజు ప్రభుత్వ పోటీ పరీక్షలున్నందున.. జెన్ కో నిర్వహించే రాత పరీక్షను వాయిదా వేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలియజేశారు. దీంతో వారి విన్నపం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ పరీక్షను వాయిదా వేశారు. అయితే.. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. తదుపరి షెడ్యూల్ ను జెన్ కో వెబ్ సైట్ లో పెడతామని పేర్కొంది.

Read Also: CBSE Class 10 Exam: 10-12వ తరగతి పరీక్షల తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ