Local Body Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసింది.. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు.. పోలింగ్ కేంద్రం ఆవరణలో మధ్యాహ్నం 1 గంటలోపు ఉన్న వారికి టోకెన్లు జారీ చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బ్యాక్స్ లను సీల్ చేశారు.. కాగా.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు చేపడతారు.. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి, కట్టలు కట్టే ప్రక్రియ కొనసాగిస్తారు.. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్లు ఉంచుతారు.. బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ ను ట్రేలో అమర్చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు.. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం.. వార్డు సభ్యులతో కలిసి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. గ్రామాల్లో జరిగే ఘటనపై లైవ్ అప్డెట్స్ మీ కోసం..
గద్వాల జిల్లా: గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డిలో ఉద్రిక్తత. ఉపసర్పంచ్ పదవి విషయంలో వివాదం. ఎన్నికలు నిర్వహిస్తున్న స్కూల్ గేటుకు తాళం వేసి నిరసన. పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కు సంబంధించిన బాక్సులని స్కూల్లోనే పెట్టి గేటుకు తాళం. పరిస్థితి ఉద్రిక్తం.
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ అర్బన్ మండలం చింతంటానలో ఎన్నికపై ఉత్కంఠ. గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి గెలుపు. అధికారికంగా ప్రకటించాలని గ్రామస్తుల డిమాండ్. చనిపోయిన అభ్యర్థి గెలుపుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని వార్డు సభ్యులకు తెలిపిన అధికారులు. వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించిన అధికారులు.
సూర్యాపేట : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి బోయపల్లి కిషన్ విజయం ..
జగిత్యాల జిల్లా: 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు. ఎన్నికల డ్యూటీకి 89 మంది సిబ్బంది గైర్హాజరు.. అందరికీ షోకాజ్ నోటీసులు జారీ.. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశాలు.. నియమావళి ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవన్న కలెక్టర్ సత్యప్రసాద్.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్ నమోదు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదు. -ఎస్ఈసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ. స్వగ్రామంలో సర్పంచ్ గెలిపించుకోలేకపోయినా ఎమ్మెల్యే. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం అయిన చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం గులాబీ కైవసం.. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 84 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 3 వార్డులలో బీఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు
రంగారెడ్డి జిల్లా 7 మండలాల్లో 174 గ్రామపంచాయతీల్లో 6 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 168 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వెలువడిన సర్పంచి ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 59 పంచాయతీల ఫలితాలు వచ్చాయి. అందులో 34 గ్రామాల్లో కాంగ్రెస్, 20 గ్రామాల్లో బీఆర్ఎస్, 1 గ్రామంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు, 4 గ్రామాల్లో స్వతంత్రులు గెలిచారు. వికారాబాద్ జిల్లాలో 8 మండలాల్లో 262 గ్రామ పంచాయతీల్లో 39 గ్రామాలు ఏకగ్రీవం కాగా... 223 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వెలువడిన సర్పంచ్ ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 75 పంచాయతీల ఫలితాలు వచ్చాయి. 60 కాంగ్రెస్, 12 బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా. కాంగ్రెస్ 688, బీఆర్ఎస్ 253, బీజేపీ 38 సర్పంచ్ అభ్యర్థుల గెలుపు. ఇవాళ మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. తొలి దశ సర్పంచ్ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 80 శాతం సర్పంచ్ స్థానాలకు కైవసం.
జగిత్యాల జిల్లా తిమ్మయ్యపల్లిలో సర్పంచ్ స్థానానికి పోటీపడ్డ తల్లీకూతుర్లు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ బరిలో తల్లి (బీఆర్ఎస్)పై విజయం సాధించిన కూతురు (కాంగ్రెస్).
నిజామాబాద్ జిల్లా జాడి జమాల్‌పూర్‌లో ఉద్రిక్తత. పోలీసులు, గ్రామస్తుల మధ్య గొడవ. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు అభ్యర్థి మద్దతుదారుల యత్నం. అడ్డుకొని చెదరగొట్టిన పోలీసులు.
తెలంగాణలో కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్. మొత్తం 4,231 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక. కాంగ్రెస్ బలపర్చిన 534 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపు. బీఆర్ఎస్ బలపర్చిన 167 సర్పంచ్ అభ్యర్థుల గెలుపు. బీజేపీ బలపర్చిన 21 మంది సర్పంచ్ అభ్యర్థుల గెలుపు.
జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం (మం) తిమ్మాపూర్ తండాలో బీఆర్ఎస్ గెలుపు. మెట్పల్లి (మం) కేసీఆర్ తండాలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు. వనపర్తి జిల్లాలోని గోపాల్పేట (మం) జింకల బీడు తండాలో 32 ఓట్ల తేడాతో BRS గెలుపు. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు (మం) రాగట్లపల్లిలో 4 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు. కామారెడ్డి (మం) రాఘవాపూర్‌లో బీజేపీ అభ్యర్థి గెలుపు.
వనపర్తి జిల్లాలోని బుగ్గపల్లితాండలో 14 ఓట్ల తేడాతో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి విజయం. సిద్దిపేట జిల్లాలోని మాందాపూర్‌లో 60 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు. భద్రాద్రి జిల్లాలోని మణుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం. నిర్మల్ జిల్లాలోని పెంబి (మం) వేణునగర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం.
మరికాసేపట్లో వెలువడనున్న ఫలితాలు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 166 పంచాయతీలకు 33 ఏకగ్రీవం. నిర్మల్ జిల్లాలో 136 పంచాయతీలకు 16 ఏకగ్రీవం. మంచిర్యాల జిల్లాలో 90 పంచాయతీలకు 4 ఏకగ్రీవం. కొమురంభీం జిల్లాలో మొత్తం 114 పంచాయతీలకు 7 ఏకగ్రీవం. కరీంనగర్ జిల్లాలో 92 పంచాయతీలకు 3 ఏకగ్రీవం. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 పంచాయతీలకు 4 ఏకగ్రీవం. సిరిసిల్ల జిల్లాలో 87 పంచాయతీలకు 5 ఏకగ్రీవం. జగిత్యాల జిల్లాలో 122 పంచాయతీలకు 4 ఏకగ్రీవం.
తెలంగాణలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93 శాతం పోలింగ్. మెదక్ జిల్లాలో 86 శాతం పోలింగ్ నమోదు. వరంగల్ జిల్లాలో 81.2 శాతం పోలింగ్ నమోదు. ములుగు జిల్లాలో 73.57 శాతం, హన్మకొండలో 75.6 శాతం, జనగాంలో 71.96 శాతం పోలింగ్ నమోదు. సూర్యాపేట జిల్లాలో 87.77 శాతం పోలింగ్ నమోదు. నల్గొండ జిల్లాలో 81.63 శాతం పోలింగ్ నమోదు. నిర్మల్ జిల్లాలో 79.81 శాతం పోలింగ్ నమోదు. ఆదిలాబాద్‌లో 69.10 శాతం పోలింగ్ నమోదు. మంచిర్యాల జిల్లాలో 77.34 శాతం పోలింగ్ నమోదు.
ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్.. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు..
యాదాద్రి జిల్లాలో పోలింగ్ ముగిసే సమయం వరకు 87.93% పోలింగ్ నమోదు.
వరంగల్: వరంగల్ జిల్లాలో 81.2% ఓటింగ్ నమోదు.. ముగిసిన పంచాయతీ పోలింగ్ సమయం.. 1గంటకు పోలింగ్ కేంద్రాల ప్రధాన గేట్లకు తాళాలు.. పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరిన ఓటర్లు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మధ్యాహ్నం 1గంట వరకు 84.2 శాతం పోలింగ్ నమోదు.. 10 నుంచి 12 శాతం ఓటర్లు క్యూ లైనల్లోనే.. 1గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం..
ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం.. పోలింగ్ కేంద్రం ఆవరణలో మధ్యాహ్నం 1 గంటలోపు ఉన్న వారికి టోకెన్లు జారీ చేయనున్న ఎన్నికల అధికారులు.. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బ్యాక్స్ లను సీల్ చేయనున్న ఎన్నికల అధికారులు.. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు.. మొదటగా సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి, కట్టలు కట్టే ప్రక్రియ.. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్లు.. బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ ను ట్రే లో అమర్చి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు.. ఫలితాల ప్రకటన.. వార్డు సభ్యులతో కలిసి ఉప సర్పంచ్ ఎన్నిక
భద్రాద్రి.. భద్రాచలం, సారపాక మేజర్ పంచాయతీలో ఇంకా బారులు తీరిన ఓటర్లు.. గేట్లు వేసి లోపల ఉన్న వారికి ఓటింగ్‌కు అవకాశం..
ఖమ్మం జిల్లా మంచుకొండ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఏసీపీ రమణమూర్తిని పోలింగ్ ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్న సునీల్ దత్.. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఎటువంటి ఘటనలు జరగలేదని తెలిపిన సునీల్ దత్..
ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. పట్టుబడ్డ దొంగ ఓట్లు.. అధికారుల నిర్లక్ష్యం మహిళ ఆరోపణ..
పోలీసుల అత్యుత్సాహం.. అభ్యర్థులను అనుమతించని అధికారులు..
సిద్దిపేట: ములుగు (మం) బహిలంపూర్ గ్రామంలో పోలీసులకు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం.. పోలింగ్ కేంద్రం వద్దకి గుంపులు గుంపులుగా రావొద్దన్న పోలీసులు.. ప్రశాంతంగా నడుస్తున్న పోలింగ్ సరళిని పోలీసులు చెడగొడుతున్నారని గ్రామస్థుల ఆగ్రహం..
పెద్దపల్లి జిల్లా మంథని మండలం తోటగోపాయ్యపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మదరవేన పర్వతాలు యాదవ్ ను మంథని సీఐ రాజు ఇంటి లోపల నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి లాఠీతో తీవ్రంగా దాడి చేసినట్లు గ్రామ ప్రజలు ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితుడు పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ తాను నిన్న రాత్రి మంథని నుంచి ఇంటికి వస్తుండగా లక్కేపూర్ గ్రామానికి చెందిన కొంతమంది తన ద్విచక్ర వాహనానికి అడ్డు వచ్చి నాతో గోడవ పడి దాడి చేశారని తెలిపారు.
ఇట్టి విషయం పై మంథని సీఐ రాజు ఇంటి వచ్చి తనపై తన కొడుకుపై లాఠీతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ బూతులు మాట్లాడుతూ దాడి చేశారని ఆవేధన వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో ఎనిమిది మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. జిల్లా పరిధిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. 11 గంటక వరకు 50 శాతం పోలింగ్ జరిగింది.. మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటు వేసేందుకు సమయం ఉంది. టైమ్ టూ టైమ్ మానిటరింగ్ చేస్తున్నాం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద మైక్రో అబ్జార్వర్స్ లను నియమించాము. లైవ్ వెబ్ కాస్టింగ్ ఎన్నికల కమిషన్ వరకు ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ నిర్వహిస్తాం. కౌంటింగ్ అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు జరగలేదు.. నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కొనసాగుతుంది: వికారాబాద్ జిల్లా -కలెక్టర్ ప్రతీక్ జైన్.
రాజన్న సిరిసిల్ల 48.43%
కరీంనగర్ 49.41%
జగిత్యాల 47.63%
పెద్దపల్లి 52.54%
తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో రుద్రంగి మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. ప్రజల స్పందన చూస్తే మొదటి విడత జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తారన్న ధీమా.. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం.. పదేళ్లపాటు పాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది.. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మెట్ పై హరీష్ రావు కేటీఆర్ తెలంగాణకు పేరు వస్తే ఎందుకు ఇంత కడుపు మంట.. తెలంగాణ సబ్బండ వర్గాలు అభివృద్ధి కోరుకుంటే, దుబాయ్ వాట్సప్ గ్రూపుల ద్వారా విష ప్రచారం చేయడం, ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరైనది కాదు: ప్రభుత్వ విప్
కొమురం భీం జిల్లాలో 58.51 %
మంచిర్యాల జిల్లాలో 48.87 %
ఆదిలాబాద్..40.37 శాతం %
నిర్మల్ జిల్లాలో 43.57 %
వరంగల్ జిల్లాలో 61 %
జనగామ జిల్లాలో 47.92 %
మహబూబాబాద్ జిల్లాలో 61.87%
హన్మకొండ జిల్లా 46 %
ములుగు 43.94 %
భూపాలపల్లి జిల్లాలో 59 %
షాద్‌నగర్ నియోజకవర్గంలో 11:00 గంటల వరకు 56% పోలింగ్ నమోదు..
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మూడు గ్రామ పంచాయతీల ఉదయం 11 గంటల పోలింగ్ శాతం
నందిగామ 53:42 %
క్యాసారం 67:53 %
భానురు 45:26%
శంషాబాద్‌లో బ్యాలెట్ పత్రాన్న చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రంలో ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనలో ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో ఎన్నికల సరళిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణం లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అన్నారు.
నిజమాబాద్: అంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఇద్దరు పేషెంట్లు.. సాలూర మండలం జాడి జమాల్ పూర్ పోలింగ్ కేంద్రంలో అంబులెన్స్ లో వచ్చి ఓటేసిన ఓటర్లు.. అంబులెన్స్ వద్దకు వచ్చి ఓటు వేయించిన ఎన్నికల అధికారులు..
నిర్మల్ జిల్లా పెంబి మండలం యాపల్గూడకు థర్మకోల్ పడవ మీద ఎన్నికల సిబ్బంది తరలింపు.. గ్రామానికి వెళ్ళే మార్గంలో కడెం వాగు ఉండటంతో మరపడవ మీద ఎన్నికల సామాగ్రితో దాటి న ఎన్నికల సిబ్బంది...
సైకిల్ పై వచ్చి ఓటేసిన సంగారెడ్డి తహశీల్దార్ జయరాం.. కందిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మార్వో..
సంగారెడ్డి: మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2700 కి.మీ ప్రయాణం చేసిన యువతి.. ఐఐటీ గౌహతిలో థర్డ్ ఇయర్ చదువుతున్న అశ్విత.. ఓటు వేయడానికి ఐఐటీ గౌహతి నుంచి కంది గ్రామానికి వచ్చి ఓటు వేసిన అశ్విత...
ఓటేయడానికి పల్లె బాట పట్టిన పట్నం ప్రజలు.. పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్తున్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు.. చౌటుప్పల్ దగ్గర హైవేపై భారీగా వాహనాలు.. ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్న జనం.. ఉదయం 9గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదు..
కరీంనగర్: ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ జిల్లాలో 16.2 శాతం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18.47 శాతం.. పెద్దపల్లి జిల్లాలో 17.31 శాతం.. జగిత్యాల జిల్లాలో 19.07 శాతం పోలింగ్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా గ్రామానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు..
కామారెడ్డి : కామారెడ్డి డివిజన్ లోని 10 మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్.. తొలి రెండు గంటల్లో 19.70 శాతం పోలింగ్ నమోదు.. భిక్కనూరు, రామారెడ్డి, సదాశివ నగర్ రాజం పేట, తాడ్వాయి లొ మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు.. బీబీపేటలో మందకొడిగా కొనసాగుతున్న పోలింగ్..
హయత్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. సర్పంచ్ మొదటి విడత ఎన్నికలు కావడంతో ఓట్లు వేయడానికి వెళ్తున్న ప్రయాణికులు.. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం, భాగ్యలత వరకు ట్రాఫిక్ జామ్.. నెమ్మదిగా కదులుతున్న వాహనాలు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో తన తల్లిని గెలిపించాలని ఓటర్లను వేడుకుంటున్న యువతి పలువురిని ఆకర్షిస్తుంది. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. అనుపురం గ్రామంలో ఎస్సీ మహిళ స్థానానికి ముగ్గురి మధ్యలో తీవ్ర పోటీ ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి బారులు తీరారు.
సిద్ధిపేట: గజ్వేల్ మండలం అక్కారంలో ప్రలోభాల పర్వం.. కారులో తరలిస్తున్న రూ. 2.25 లక్షలు పట్టుకున్న పోలీసులు.. జగదేవ్ పూర్ సర్పంచ్ అభ్యర్థి డబ్బుగా పోలీసుల అనుమానం..
జనకం పెట్ గ్రామాంలో పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి.. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.. ఒంటి గంటగంటకు క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తాం.. రెండుగంటల నుండి కౌంటింగ్ ప్రారంభం.. కౌంటింగ్ అయిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది.. 71 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాము.. గత పంచాయితీ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదు అయింది.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది.. జిల్లాలో 157 పంచాయితీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.. పోలింగ్ విధులకు హాజరు కాని సిబ్బందికి అధికారులకు షోకాజ్ నోటీస్ లు జారీ చేశాం: కలెక్టర్
వరంగల్ జిల్లా ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం నుంచి ఓటు వేసేందుకు బారుల తీరిన
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న తొలి విడత ఎన్నికలు.. చలి తీవ్రతకు మందకొడిగా సాగుతున్న పోలింగ్.. ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లు.. బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్.. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీవో రాధాబాయి, ఎమ్మార్వో, ఎంపీడీవోలు
కామారెడ్డి: కామారెడ్డి డివిజన్ లో మొదలైన పోలింగ్.. 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు, బరిలో 727 మంది అభ్యర్థులు.. 1457 పోలింగ్ కేంద్రాల్లో మొదలైన పోలింగ్.. ఐదు అంచెల భద్రత ఏర్పాట్లు.. 33సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట పోలీసు బందోబస్తు..
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. దాడిలో గాయపడిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు.. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు..
నిజామాబాద్: బోధన్, కామారెడ్డి డివిజన్ లో మొదలైన తొలి విడత ఎన్నికల పోలింగ్.. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు.. బోధన్ డివిజన్ లో 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు.. బరిలో 546 మంది అభ్యర్థులు.. 1440 కేంద్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,48,585 ఓటర్లు.. 1384 మంది పోలీసుల తో బందోబస్తు