Local Body Elections: తెలంగాణలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 గ్రామపంచాయతీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల పదవుల కోసం 65,455 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు సగటున 3.38 మంది, వార్డు స్థానాలకు సగటున 2.36 మంది పోటీ పడుతున్నారు. కాగా.. మధ్యాహ్నం 2 గంటల తరువాత లెక్కింపు ప్రారంభం అవుతుంది. అనంతరం ఫలితాలు సాయంత్రం ప్రకటిస్తారు. ఉపసర్పంచ్‌ను సైత నేడే ఎన్నుకుంటారు. గ్రామాల్లో జరిగే ప్రతి అంశంపై ఎన్టీవీ లైప్‌అప్డెట్స్ మీ కోసం..
Local Body Elections Live Updates: నేడు తొలి దశ పంచాయతీ “పోరు” షురూ..
- తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు షురూ
- 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
- మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
- నేడే ఫలితాలు వెల్లడి

Local