Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- తెలంగాణలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం..
- ఇకపై అన్ని సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం
- ‘పెద్ది’ సినిమాకూ ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం
- పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమాను ప్రదర్శిస్తామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Exhibitors Association: తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎక్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో విడుదలయ్యే ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది (Peddi) సినిమాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సంఘం వెల్లడించింది.
తాజాగా నిర్వహించిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మాకు ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజ్ కావాలని తేల్చి చెప్పారు. అది ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాలి. పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమా ప్రదర్శిస్తాం” అని స్పష్టం చేశారు. నిర్మాతలు కావాలనే ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని ఈ సందర్బంగా వారు ఆరోపించారు.
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ఇదివరకు హరిహర వీరమల్లు సినిమా సమయంలో తమ డిమాండ్‌ను వినిపించామని.. అయితే ఆ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వెనక్కి తగ్గామని తెలిపారు. ఆ తర్వాత నుంచి పర్సంటేజ్ విధానం గురించి నిరంతరం చర్చలు జరుపుతున్నప్పటికీ నిర్మాతల నుంచి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడుతూ ఈ దశకు వచ్చిందని, అయినప్పటికీ ఈ సినిమాను వదిలేసి తర్వాతి పెద్ద సినిమాకు ఈ నిబంధన అమలు చేద్దామని కొందరు సూచించారని తెలిపారు. మరోవైపు నిర్మాతలు మూడు వారాల సమయం కోరారని, అయితే ఇక ఆలస్యం సరైంది కాదని భావించి ‘పెద్ది’ సినిమాను కూడా పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
టికెట్ ధరల పెంపుపై కూడా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచకూడదని సంఘాల తరఫున సీఎం రేవంత్ రెడ్డికు మెమొరాండం ఇచ్చినట్లు తెలిపారు. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు దూరమవుతారని, అలాంటి నిర్ణయాలతో సినిమాను చంపవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అలాగే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున చివరిగా ఒకే మాట చెబుతున్నామని.. ఇకపై ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే తమ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్ జువ్వాడి శేఖర్ రావు ఎన్నికయ్యారు. ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
థియేటర్లలో రెంట్ ట్రాక్ విధానాన్ని అమలు చేయడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఎక్కడా ఫ్రాడ్ జరగడం లేదని.. పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే థియేటర్ల గ్రేడింగ్ విషయంలో కూడా.. థియేటర్లలో ఉన్న సౌండ్ సిస్టమ్, ఏసీలు వంటి సౌకర్యాల ఆధారంగా కాకుండా, ఆయా థియేటర్లకు వచ్చే కలెక్షన్ల ఆధారంగానే గ్రేడింగ్ చేయాలని సూచించారు. అలాంటి గ్రేడింగ్ విధానానికి మాత్రమే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
పెద్ది సినిమాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలిపారు. “పెద్ది లాంటి సినిమాలకు మేము సెల్యూట్ చేస్తాం. ఆ సినిమాపై మాకు ఎలాంటి పగ లేదు” అని పేర్కొన్నారు. మొదట ఈ వివాదం నుంచి ‘పెద్ది’ సినిమాను మినహాయించాలని అనుకున్నామని, అయితే ఆ సినిమా తర్వాత కూడా తమ సమస్యలను ఎప్పుడు పట్టించుకుంటారో స్పష్టత లేకపోవడంతో చివరికి ‘పెద్ది’ సినిమాను కూడా ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాకన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..