NTV Telugu Site icon

Telangana Elections 2023: నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌.. ఎవరి వ్యూహాల్లో వారు బిజీ!

Telangana Assembly Election Schedule

Telangana Assembly Election Schedule

Telangana Assembly Election Schedule to Released Today: ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో ఎన్నికలకు సంబందించిన వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది తెలంగాణ సహా రాజస్థాన్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. నవంబర్‌ మూడో వారం నుంచి డిసెంబర్‌ మొదటి వరం లోపు ఎన్నికలు జరగొచ్చని ఈసీ వర్గాలు ఇదివరకే పేర్కొంది.

తెలంగాణలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగుస్తుంది. 2018 డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉండే 114 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అయితే మరో 5 స్థానాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మల్కాజ్ గిరి, జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోష మహల్ నియోజక వర్గాల్లో పోటీలో ఉండే నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే పెండింగ్‌లో స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ప్రస్తుతం అసంతృప్త ,అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్ ఉంది.

Also Read: Rohit Sharma: ఇన్నింగ్స్ ఆరంభం చూసి భయపడ్డా: రోహిత్ శర్మ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలపై బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తోంది. అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను హడావిడిగా చేస్తున్నారు. మరోవైపు మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్లో ఈ నెల 16న బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో సభ ఉంటుందా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ సభ ఉంటే అక్కడే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది.

Show comments