Jupally Krishna Rao Aggressive Comments On CM KCR: ఎన్నికలు రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్ వేషాలు మారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు. కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని జూపల్లి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన కాలి గోటికి కూడా సరిపోరని, ఏ విషయంలో తన కంటే గొప్పోడని జూపల్లి మండిపడ్డారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోమని తనకు సీఎం చెప్పారంటూ సంచలనానికి తెరదీశారు.
‘అహంకారంలో కేసీఆర్‌ని మించిన వాళ్లు ఎవరున్నారు?. అహంకార పూరితంగా మాట్లాడుతుంది కేసీఆర్. డబ్బు, అధికారం ఉందనే అహంకారంతోనే కదా ఎమ్మెల్యేలను కొంటున్నావు. నేను బీజేపీ లీడర్‌ని మేనేజ్ చేయాలా?. మాట్లాడటానికి బుద్ది ఉండాలి. అంబేద్కర్‌కి పూలమాల కూడా వేయంది అహంకారంతోనే కదా?. ఒక్క అమర వీరుడి కుటుంబాన్ని కూడా పరామర్శించనిది అహకరంతోనే. ఎమ్మెల్యే, మంత్రులను కూడా కలవకుండా అహంకారంతో ఉన్నది నువ్వు. నా కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. ఏ విషయంలో నా కంటే గొప్పోడివి. నన్ను వేలు పెట్టి చూపించే హక్కు నీకు లేదు’ అని జూపల్లి సీఎంపై ఫైర్ అయ్యారు.
‘ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ పగటి వేశగాడి లెక్క వేషాలు మారుస్తున్నారు. అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్. ఢిల్లీకి పోతే దేశ పార్టీ అధ్యక్షుడు అయిన రాహుల్, సోనియాలు కలుస్తారు. మీ లెక్క కాదు వారు. నీ బిడ్డ కవిత మేనేజ్ చేయలేకనే ఒడిపోయిందా?. మరి నువ్వెందుకు ఒడిపోయావు.. వినోద్ ఎందుకు ఓడిపోయాడు. కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది’ అని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
‘కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాణి వాళ్లకు డబ్బులు ఇస్తాం రండి అని మేనేజ్ చేసుకుంటుంది మీరు. మీ లెక్క మేనేజ్మెంట్ చేయలేము మేము. తెలంగాణ తెచ్చుకుంది అందుకునేనా?. దళిత బంధు అందరికి ఇచ్చావా?. బీఆర్ఎస్ నేతలు దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నారు. రెండేళ్లలో 2 వేల కోట్లు ఇవ్వలేని వాడు.. 20 రోజుల్లో లక్ష కోట్లు ఎలా తెస్తాడు. ఏ విషయంలో నాతో చర్చకు వస్తారో రండి. కేటీఆర్, హరీష్.. ఎవరిస్తారో రండి. అబిడ్స్ అమరవీరుల స్థూపం దగ్గర చర్చకి వస్తావా?’ అని జూపల్లి సవాల్ విసిరారు.