Site icon NTV Telugu

Telangana Elections 2023: జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత!

Brs, Congress

Brs, Congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 245 పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉండడం, జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువ సేపు పోలింగ్ బూత్ దగ్గరే ఉంటూ ఓటర్లను కలుస్తున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడికే దిగారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. లాటీలు ఝుళిపించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. జనగామ నుంచి బీఆర్‌ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version