Telangana Election Results: ప్రజలు మార్పు కోరుకున్నారు.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తా: కడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadiyam Srihari Says We will play the role of opposition: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించారని, నిండు మనసుతో ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు అని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో కేసీఆర్ నిలబెట్టారు, అయితే ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నా అని కడియం పేర్కొన్నారు. కడియం శ్రీహరి 7,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సిగపురం ఇందిరాపై విజయం సాధించారు. కడియంకు 88,329 ఓట్లు రాగా.. ఇందిరాకి 80,510 ఓట్లు పోల్ అయ్యాయి.
విజయం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ… ‘స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించారు. నాకు సహకరించి నిండు మనసుతో ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. అంతిమంగా ప్రజల తీర్పు ఫైనల్ తీర్పు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడింది. కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణ అభివృద్ధిలో అలుపెరగని పోరాటం చేసాము. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నాము. శక్తి వంచన లేకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. విలువలతో కూడిన రాజకీయం కడియం శ్రీహరి చేస్తారని నన్ను ప్రజలు గెలిపించారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతాం’ అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!