NTV Telugu Site icon

Telangana Election Results: ప్రజలు మార్పు కోరుకున్నారు.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తా: కడియం

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari Says We will play the role of opposition: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించారని, నిండు మనసుతో ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు అని బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో కేసీఆర్ నిలబెట్టారు, అయితే ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నా అని కడియం పేర్కొన్నారు. కడియం శ్రీహరి 7,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సిగపురం ఇందిరాపై విజయం సాధించారు. కడియంకు 88,329 ఓట్లు రాగా.. ఇందిరాకి 80,510 ఓట్లు పోల్ అయ్యాయి.

విజయం అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ… ‘స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించారు. నాకు సహకరించి నిండు మనసుతో ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. అంతిమంగా ప్రజల తీర్పు ఫైనల్ తీర్పు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడింది. కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణ అభివృద్ధిలో అలుపెరగని పోరాటం చేసాము. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించనున్నాము. శక్తి వంచన లేకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. విలువలతో కూడిన రాజకీయం కడియం శ్రీహరి చేస్తారని నన్ను ప్రజలు గెలిపించారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతాం’ అని అన్నారు.