Site icon NTV Telugu

Telangana E PASS : విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు 15 నుంచి స్కాలర్‌ షిప్‌ దరఖాస్తులు

Ts Epass

Ts Epass

Telangana E Pass Scholarship Application starts from august 15th

తెలంగాణలోని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు 2022-23 సంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఫ్రెష్‌, రెన్యూవల్‌ స్కాలర్‌ షిప్‌లు తెలంగాణ ఈ పాస్‌ వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపింది. ఈ నెల ఆగస్టు 15ను నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఈ నెల 15 నుంచి అక్టోబర్‌ 15 వరకు విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు వెల్లడించింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మరింత సమాచారం కోసం http://telanganaepass.cgg.gov.in వెబ్‌ సైట్‌ను సంప్రదించవచ్చు..

 

Exit mobile version