Double Bedroom: తెలంగాణలో వారి డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దయ్యే అవకాశం.. కారణం ఇదే..
- డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు అలర్ట్..
- అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు..
- వారి ఇళ్లను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు , అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ పథకం అసలు ఉద్దేశం పేదలకు సొంత గూడు కల్పించడం కాబట్టి దానిని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నట్లు తేలితే… ఆ కేటాయింపులను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా చోట్ల లబ్ధిదారులు తమకు వచ్చిన ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా అమ్ముకోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Also Read:కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వారి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ..
అనర్హులు లేదా అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న తర్వాత అందులో పేర్కొన్న సమయంలోగా సరైన వివరణ ఇవ్వని పక్షంలో.. వారి ఇంటి కేటాయింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తుంది. రద్దు చేసిన ఇళ్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఇతర అర్హులైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
భవిష్యత్తులో అక్రమాలను నివారించడానికి లబ్ధిదారుల వేలిముద్రలు లేదా ఆధార్ ఆధారిత తనిఖీలు చేపట్టే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని.. రాజకీయ నాయకుల సిఫార్సులతో లేదా అక్రమ మార్గాల్లో ఇళ్లను పొందిన వారికి చెక్ పడుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!