Site icon NTV Telugu

Mahesh Kumar Goud: అక్టోబర్ నెలాఖరు వరకు పూర్తికానున్న డీసీసీ అధ్యక్షుల నియామకాలు!

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు తాను వివరించానని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పుకొచ్చారు.

Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్!

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అనంతరం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశాను. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను వివరించాను. అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తవుతుంది. జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఖర్గే నిర్గేశించారు. సంస్థాగత పునర్నిర్మాణం పగద్బందీగా, ఏ గ్రూపు ఒత్తిడికి లొంగకుండా పనిచేయాలన్నారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను పరిశీలకులు సమర్పిస్తారు. అక్టోబర్ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది’ అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు.

Exit mobile version