సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ అమాయకులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాట్సాప్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు సలహాలు సూచనలు జారీ చేసింది. వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే ఏం చేయాలి? ఫిర్యాదు ఎలా చేయాలి? ఇలాంటి విషయాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడ్వైజరీ జారీ చేసింది.
Also Read:American Politics: అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం..? క్రైస్తవ దేశంలో నయా చరిత్ర!
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లను ఆర్టీఏ చలాన్/బ్యాంక్ కేవైసీ, కొరియర్ నోటీస్/ఇన్వాయిస్ చెల్లింపులు, వీడియో/ఫోటో షేరింగ్ యాప్ పేర్లతో పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇవి ఇన్ స్టాల్ చేస్తే మీ ఎస్ఎంఎస్/ఓటీపీ/కాంటాక్ట్స్/వాట్సాప్ పై నియంత్రణ తీసుకుంటారు. ఐఫోన్ వినియోగదారులను కూడా కాల్/ఎస్ఎంఎస్ ఫార్వార్డింగ్ ట్రిక్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్ లో వచ్చింది అని తెలియని ఏ యాప్ అయినా ఇన్ స్టాల్ చేయొద్దని తెలిపింది.
వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది?
అండ్రాయిడ్ లో:
వాట్సాప్ లో ఒక లింక్ లేదా ఏపీకే పంపుతారు. మీరు దాన్ని ఇన్ స్టాల్ చేస్తారు. అంతేకాదు ఆ యాప్ కు వచ్చే ఎస్ఎంఎస్/ఓటీపీలు ఇతరులు చదివే అనుమతులు ఇస్తారు. ఆ ఓటీపీతో నేరగాడు మీ వాట్సాప్ ను తన ఫోన్ లో రిజిస్టర్ చేస్తాడు. మీ వాట్సాప్ లాకౌట్ అవుతుంది. వెంటనే నేరగాడి చేతుల్లోకి వెళ్లిపోతుంది. సైబర్ నేరగాడు మీ పేరుతో మీ ఫ్రెండ్స్/ ఫ్యామిలీ కి మెసేజ్ చేసి డబ్బులు అడుగుతాడు.
ఐఫోన్ లో:
నేరగాడు 21*సంఖ్య#లాంటి నెంబర్ డయల్ చేయమని మీకు చెప్తారు. ఇది నిజానికి కాల్ ఫార్వార్డింగ్ కోడ్. దాంతో మీ ఓటీపీలు అండ్ వెరిఫికేషన్ కాల్స్ మీకు కాకుండా సైబర్ నేరగాడికి వెళ్లడం ప్రారంభం అవుతుంది. ఇలా మీ వాట్సాప్ హ్యాక్ అవుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?
మీ మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే..
కాల్ ఫార్వార్డింగ్ ను సెట్టింగ్స్ లోకి వెళ్లి డిసేబుల్ చేయండి. ముఖ్యమైన ఫొటోలు/ ఫైల్స్ బ్యాకప్ చేసుకోండి. తెలియని లేదా అనుమానాస్పద యాప్స్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి. ఫాక్టరీ రిసెట్ చేసి హైడ్ ఆప్షన్స్ ను తొలగించండి. యాప్స్ ను మళ్లీ కేవలం ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుంచే ఇన్ స్టాల్ చేయండి. వాట్సాప్ ను మళ్లీ ఇ న్ స్టాల్ చేసి, మీ నెంబర్ తో వెరిఫై చేయండి.
వాట్సాప్ లాగిన్ బ్లాక్ అయితే:
మీ అకౌంట్ ను తిరిగి పొందేందుకు WWW.Whatsapp.com/contact ద్వారా పొందొచ్చు. హైడ్ లేదా ప్రమాదకర యాప్స్ ను గుర్తించడానికి M-Kavach 2(ప్రభుత్వ మొబైల్ సెక్యూరిటీ యాప్)ను ఇన్ స్టాల్ చేయండి.
Also Read:Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తి… మనస్తాపంతో ఆత్మహత్య!
జాగ్రత్తలు అండ్ ఫిర్యాదులు:
భద్రత కోసం వాట్సాప్/ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను ఎప్పుడూ ఇన్ స్టాల్ చేయకండి. *21*number# వంటి ప్రత్యేక నంబర్లు డయల్ చేయమని చెప్పినప్పుడు ఎప్పుడూ చేయకండి. ఇవి కాల్ ఫార్వార్డింగ్ నంబర్లు కావొచ్చు. వాట్సాప్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ ని తప్పనిసరిగా అమలు చేయండి. తక్షణ ఫిర్యాదు కోసం 1930- సైబర్ మోసాల హెల్ప్ లైన్(డబ్బు నష్టం జరిగితే) లేదా వెబ్ సైట్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.
