NTV Telugu Site icon

CM Revanth Reddy : వరుసగా వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేపడుతున్నాం..

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ.. ఆధ్వర్యంలో ఇవ్వాళ ఇంతమంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, తెలంగాణ గత ప్రభుత్వ నిర్ణయాలు మీరు చూసారన్నారు. ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన నియామకాలు చూస్తున్నామని, వరుసగా వైద్య ఆరోగ్య శాఖ లో నియామకాలు చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. నర్సింగ్, పారామెడికల్, వైద్యులు… వైద్యారోగ్య శాఖ సిబ్బంది నియామకాలు చేపట్టినామని, మరిన్ని కూడా చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. సంవత్సరం ముగియకముందే 14 వేల నియామకాలు చేపట్టడం చరిత్ర లో నిలిచిపోయిందని, ఆరోగ్య తెలంగాణ గా మార్చడానికి మంత్రి వెంబడిబడి పనులు చేసుకున్నారన్నారు. మెడికల్ కాలేజీల అడ్మిషన్ ల విషయంలో కాలేజీల అనుమతులకు చాలా కృషి చేశారని, చిత్తశుద్ధి లేకపోతే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటాయి… కానీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర విజయవంతంగా పనిచేస్తున్నారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఉద్యోగ నియామకాలు కోసం యువత ఆనాడు రోడ్ మీదకు వచ్చారని, కానీ పదేళ్లలో భర్తీ చేయలేక పోయారన్నారు.

Under 19 Asia Cup: భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు

అంతేకాకుండా..’నోటిఫికేషన్ ఇస్తే పరీక్ష కాదు.. పరీక్ష నిర్వహిస్తే పేపర్ లీకేజీ… చిత్తశుద్ధి లేదు అని ఆనాడే చెప్పాను… అందుకే వాళ్ల ఉద్యోగాలు ఉడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వచ్చాయి… ఒక్క ఏడాది లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుంది… డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమంది కుట్ర చేసి కొంతమంది అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్ మీదకు తీసుకొచ్చారు… అయినా కూడా పరీక్ష నిర్వహించాము.. కోచింగ్ సెంటర్ల లో యేళ్ళుగా గడిపిన యువతకు గత పదేళ్ళు… నిరాశ నిస్పృహలు మిగిల్చింది.. తెలంగాణ సమాజం మా కుటుంబం మా అనుకున్నాం…అందుకే ఒక్క ఏడాది లో 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.. పరీక్షలు వాయిదా వేస్తే తల్లిదండ్రులకు భారం అవుతారు… ఉద్యోగం వస్తె వారికి అండగా ఉంటారు..
గ్రూప్ వన్ కూడా వాయిదా వెయ్యాలని ఎంతో ఫైట్ చేశారు… కానీ కోర్టులు కూడా నిర్వహించాలని చెప్పింది.. 2011 తరువాత గ్రూప్ వన్ నిర్వహించలేదు… త్వరలో 563 మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణ అభివృద్ధికి గీటురాయి గా నిలవబోతున్నారు.. చిత్తశుద్ధి తో ఛైర్మెన్ మహేందర్ రెడ్డి పనిచేశారు.. ప్రస్తుతం బుర్రా వెంకటేశం నీ TGPSC ఛైర్మెన్ గా నియమించాం.. గతంలో RMP వైద్యున్ని TSPSC సభ్యుడిగా నియమించారు.. గతంలో రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేశారు..

అన్ని యూనివర్సిటీ లను వీసీ లను నియమించాము.. ఇంకా యూనివర్సిటీల్లో అన్ని టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు చేపడుతున్నాం.. విద్య శాఖ నీ అందుకే నేనే పర్యవేక్షిస్తున్న.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని ప్రతి పేదలకు అందాలని చూసాము.. ఈరోజు ఉచిత వైద్యాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుకున్నం. సిఎంఆర్ఎఫ్ లో 835 కోట్ల ను ఖర్చు చేసాము.. ఇది ఒక చరిత్ర… ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.. ఆర్టీసీ బస్సులో అణపైశా లేకుండా ప్రయాణం చేస్తున్నాం.. ఇందుకోసం 3800 కోట్లు రూపాయలు కేటాయించం.. 500 రూపాయలకు 50 లక్షల కుటుంబాలు వినియోగిస్తున్నాయి… రైతు రుణమాఫీ 2లక్షల లోపు ఉన్నవారికి చేసాము… రైతులకు చేతిలో డబ్బులు గలగల అంటూ ఉంటే కొంతమంది… ఫామ్ హౌస్ లలో పడుకునే వారికి గుండెల్లో మంట వస్తుంది… దానికి మందు లేదు’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

UI The Movie: ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?